Tue Mar 24 2026 15:19:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బీజేపీ చచ్చీ చెడీ...?

ఎట్టకేలకు బీజేపీకి ఊరట నిచ్చేఅంశం ఏదైనా ఉందంటే అది శివమొగ్గలో విజయం సాధించడం. శివమొగ్గలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర గెలిచారు. చివర వరకూ ఫలితం ఉత్కంఠను రేపింది. యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో చివర వరకూ పోటీ నువ్వా? నేనా ? అన్నట్లు సాగింది. ఇక మూడు పార్లమెంటు స్థానాల్లో రెండు కూటమి ఖాతాలోకి వెళ్లాయి. బీజేపీ చచ్చీ చెడీ శివమొగ్గలో విజయం సాధించడం విశేషం. మాండ్య పార్లమెంటు స్థానాన్ని జేడీఎస్, బళ్లారి పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
Next Story

