Fri Mar 27 2026 17:26:42 GMT+0530 (India Standard Time)
బీహార్ లో బీజేపీకి ఎదురుదెబ్బ

భారతీయ జనతా పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీహార్ లో ఆ పార్టీకి ఇటీవలే రాం రాం చెప్పిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపింది. బీహార్ లో గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఆర్ఎల్ఎస్పీ ఎన్నికల సమయానికి కమలానికి గుడ్ బైచెప్పింది. నిన్న మొన్నటి వరకూ ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వాహా కేంద్రమంత్రిగా ఉన్నారు. బీహార్ లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి రెండు సీట్లు ఇస్తామని చెప్పడంతో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా బీహార్ లో కాంగ్రెస్ తో కూడిన మహాకూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మహాకూటమిలో కాంగ్రెస్ , రాష్ట్రీయ జనతాదళ్ లు భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఉపేంద్ర కుశ్వాహా చేరడంతో మహాకూటమి మరింత బలోపేతమయిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.
Next Story

