Tue Mar 24 2026 12:08:19 GMT+0530 (India Standard Time)
బిక్షగత్తె కాదు...లక్షాధికారి

హైదరాబాద్ లోని ఒక్క యాచకురాలి వద్ద లక్షల రూపాయలు దొరకడం సంచలనంగా మారింది. రెండు లక్షలకు ఫై చిలుకు డబ్బుల తో పాటు వెండి మరియు బంగారం వస్తువులు దొరకడంతో అవాక్కయ్యారు.జైళ్ల శాఖ ఆధ్వర్యంలో యాచకురాల కు ఆశ్రయం కల్పిస్తున్న ఆనంద ఆశ్రమం లో ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో యాచకురాలి గా జీవిస్తున్న బిజిలి పెంటమ్మ వద్ద రూ. 2,34,320 లు లభించాయి. అయితే హైదరాబాద్ నగరాన్ని యాచక రహిత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మూసారాంబాగ్ టీవీ టవర్ చౌరస్తా వద్ద జిహెచ్ఎంసి సిబ్బంది నిర్వహించిన టింగ్స్ లో ఆమె ను ఆనంద్ ఆశ్రమానికి తరలించారు. అలాగే వెండి ఆభరణాలు, చేతి కడియాలు లభించాయి. ఆనంద్ ఆశ్రమ సిబ్బంది ఆమె పేరు పై ఎస్బిఐ సేవింగ్స్ ఖాతా ను ప్రారంభించి నగదును డిపాజిట్ చేశారు.
Next Story

