Sat Jan 31 2026 12:57:38 GMT+0000 (Coordinated Universal Time)
బషీర్ బాగ్ లో భారీ అగ్నప్రమాదం

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బషీర్ బాగ్ చౌరస్తాలోని ఐదంతస్తుల మహవీర్ భవన్ లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముందుగా పొగలు రావడంతో అప్రమత్తమైన వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బంది భవనంలో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు. అగ్నిమాపకశాఖకు సమాచారం ఇవ్వడంతో నాలుగు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చెరుకుని మంటలను ఆర్పుతున్నాయి. మంటలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ భవనంలో ఐడీబీఐ, ఐసీఐసీఐ బ్యంకులతో పాటు పలు కార్యాలయాలు పనిచేస్తున్నాయి.
Next Story

