కోడెలకు గుండెపోటని ఎందుకు చెప్పారు?
ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును బంజారాహిల్స్ పోలీసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిలోంచి మందులను స్వాధీనం చేసుకున్నట్లు బంజారాహిల్స్ [more]
ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును బంజారాహిల్స్ పోలీసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిలోంచి మందులను స్వాధీనం చేసుకున్నట్లు బంజారాహిల్స్ [more]
ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును బంజారాహిల్స్ పోలీసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిలోంచి మందులను స్వాధీనం చేసుకున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. కోడెల గతంలో గుంటూరులోనూ ఆత్మహత్యాయత్నం చేశారని పోలీసుల విచారణలో తేలింది. అయితే అప్పుడు గుండె పోటు వచ్చిందని చెప్పి బయటపడ్డారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ లను రికార్డు చేసినట్లు పోలీసులు చెప్పారు.
శివరాంనూ విచారిస్తాం…
కోడెల కొడుకు శివరాంను విచారించాల్సి ఉందన్నారు. అయితే కోడెల ముందుగా పంచతో ఉరివేసుకోవాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. ఎందుకంటే గదిలో ఓ పంచెను చింపిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. కాని చివరికి వైరుతో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోడెల ఆ రోజు ఉదయం బసవతారకం ఆసుపత్రిలోని ఓ సిబ్బందితో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ పరిణామాలను బట్టి కోడెల వారం రోజుల ముందు నుంచే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.