Sat Mar 21 2026 05:42:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బండ్ల గణేశ్ కాంగ్రెస్ లో ఎందుకు చేరారంటే?

సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితడు. పవన్ ను దేవుడిగా అభివర్ణించే బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. ఆయనకు జూబ్లీ హిల్స్ టిక్కెట్ ఖరారయిందన్న వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారయిందని చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయన నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసే అవకాశముంది. మొత్తం మీద నేతల చేరికలతో కాంగ్రెస్ లో జోష్ కన్పిస్తోంది.
Next Story

