Sun Mar 22 2026 03:03:09 GMT+0530 (India Standard Time)
దత్తాత్రేయ ఇంట విషాదం

బీజేపీ నేత, కేంద్రమాజీ మంత్రి బండారుదత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతి చెందారు. చిన్న వయసులో గుండెపోటుతో వైష్ణవ్ మృతి చెందడంతో దత్తాత్రేయ కుటుంబంలో విషాదం అలుముకుంది. దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ కు 21 సంవత్సరాలు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవ్ ఈరోజు తెల్లవారుఝామున గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి బోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. కుమారుడి మృతి వార్తను తెలుసుకున్న దత్తాత్రేయను ఆపడం ఎవరి తరమూ కాలేదు. బీజేపీ నేతలు దత్తాత్రేయ కుటుంబాన్ని పరామర్శించారు.
Next Story

