Fri Mar 27 2026 14:06:18 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : వైసీపీ పార్లమెంటు సభ్యుడు కన్నుమూత
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణించారు. ఆయనకు కొంతకాలం క్రితం కరోనా సోకింది. కరోనా చికిత్స కోసం ఆయన చెన్నైలోని ఒక ప్రయివేటు వైద్య శాలలో [more]
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణించారు. ఆయనకు కొంతకాలం క్రితం కరోనా సోకింది. కరోనా చికిత్స కోసం ఆయన చెన్నైలోని ఒక ప్రయివేటు వైద్య శాలలో [more]

తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణించారు. ఆయనకు కొంతకాలం క్రితం కరోనా సోకింది. కరోనా చికిత్స కోసం ఆయన చెన్నైలోని ఒక ప్రయివేటు వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన కొద్దిసేపటి క్రితం మరణించారు. బల్లి దుర్గా ప్రసాద్ గత ఎన్నికలకు ముందు వైసీపీ లో చేరి తిరుపతి ఎంపీగా గెలుపొందారు. గతంలో చంద్రబాబు మంత్రి వర్గంలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. బల్లి దుర్గా ప్రసాద్ మరణం పట్ల వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 1985 లో బల్లి దుర్గాప్రసాద్ రాజకీయాల్లో కి వచ్చారు. గూడూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
Next Story