Tue Mar 17 2026 00:12:17 GMT+0530 (India Standard Time)
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా
తాను అన్ని పత్రాలను ఎన్నికల కమిషన్ కు అప్పుడే ఇచ్చానని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తెలిపారు. బలరాం నాయక్ పై మూడేళ్ల పాటు అనర్హత [more]
తాను అన్ని పత్రాలను ఎన్నికల కమిషన్ కు అప్పుడే ఇచ్చానని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తెలిపారు. బలరాం నాయక్ పై మూడేళ్ల పాటు అనర్హత [more]

తాను అన్ని పత్రాలను ఎన్నికల కమిషన్ కు అప్పుడే ఇచ్చానని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తెలిపారు. బలరాం నాయక్ పై మూడేళ్ల పాటు అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తాను మహబూబాబాద్ నుంచి పోటీ చేశానని, అప్పట్లో అన్ని పత్రాలను ఎన్నికల కమిషన్ కు సమర్పించానని బలరాం నాయక్ తెలిపారు. ఇప్పటికీ తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ కు నేరుగా కాని, న్యాయస్థానం ద్వారా కానీ సమర్పిస్తానని బలరాం నాయక్ తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Next Story

