Sat Mar 21 2026 19:11:52 GMT+0530 (India Standard Time)
బాలాపూర్ లడ్డూకు రికార్డు స్థాయి ధర

బాలాపూర్ లడ్డూ ఈసారి రికార్డు ధర పలికింది. ఈ ఏడాది 16 లక్షల 60 వేల రూపాయలకు ఆర్యవైశ్య సంఘం దక్కించుకుంది. ఆర్యవైశ్య సంఘం తరుపున శ్రీనివాస్ ఈ లడ్డూను అందుకున్నారు. బాలాపూర్ లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది. గత ఏడాది పదిహేను లక్షల 60 వేలకు ధర పలకగా, ఈసారి మరో లక్ష రూపాయలకు అదనంగా వేలం పాట జరిగింది. 24 ఏళ్ల క్రితం ప్రారంభమైన బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడానికి ఎంతోమంది పోటీ పడుతుంటారు. తొలి ఏడాది రూ450ల తో ప్రారంభమయిన బాలాపూర్ లడ్డూ వేలం నేడు 16 లక్షల 60 వేలకు చేరుకుంది.
Next Story

