Thu Mar 19 2026 05:28:23 GMT+0530 (India Standard Time)
బాలకృష్ణ ధూంధాం...

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో సందడి చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనుకుంటున్న సందర్భంలో ఆయన నియోజకవర్గంలో యాక్టీవ్ గా మారారు. పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టి నియోజకవర్గమంతా తిరుగుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక ప్రజలతోనూ ఆయన కలిసి పోతున్నారు. మహిళలతో కలిసి డ్యాన్సులు చేస్తున్నారు. పోలం పనుల్లో పాల్గొంటున్నారు. దీంతో తమ నేత ఇంత ఉత్సాహంగా తమ మధ్య కలిసి తిరుగుతుండటంతో పార్టీ క్యాడర్ లో కూడా ఫుల్ జోష్ కనపడుతోంది.
Next Story

