Sun Mar 22 2026 20:15:22 GMT+0530 (India Standard Time)
టీడీపీ స్టార్ క్యాంపైనర్ గా బాలయ్య..?

తెలంగాణలో ఎన్నికలకు టీడీపీ నేతలు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిందిగా హీరో నందమూరి బాలకృష్ణను టీడీపీ నేతలు కోరారు. ఇవాళ టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్ది రెడ్డి తదితరులు సారథి స్టూడియోలో కథానాయకుడు షూటింగ్ లో ఉన్న బాలకృష్ణను కలిసి ప్రచారం చేయాల్సిందిగా కోరారు. ఇటీవల ఖమ్మంలో బాలయ్య పర్యటను విశేష స్పందన వచ్చినందున ఆయనను స్టార్ క్యాంపైనర్ గా ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తన తండ్రి ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న కథానాయకుడు జనవరిలో విడుదల కావాల్సి ఉన్నందున వేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. దీంతో షూటింగ్ మధ్య ఖాళీ సమయం దొరికితే తప్పకుండా ప్రచారానికి వస్తానని టీడీపీ నేతలకు బాలయ్య హామీ ఇచ్చారు.
Next Story

