Mon Mar 23 2026 22:37:52 GMT+0530 (India Standard Time)
బాలయ్యకు రాత్రి ఏడుగంటల వరకే టైం

వచ్చీరాని భాషలో ప్రధాని మోడీని తిట్టిన బాలకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. చంద్రబాబు దీక్ష సందర్భంగా ప్రధాని మోడీపై బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 7గంటల లోపు బాలకృష్ణ క్షమాపణ చెప్పకుంటే తామేదో చూపిస్తామని బీజేపీ నేతలు మండిపడ్డారు. బాలయ్యకు నేరచరిత్ర ఉందన్న బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎదుటే ప్రధానిని దూషించడం నేరమేనన్నారు. దీనిపై తాము గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బాలకృష్ణ ముందుగా అందరికీ తెలిసే విధంగా మాట్లాడాలని చమత్కరించారు. ఏడు గంటలలోపు క్షమాపణ చెప్పకుంటే తాము తగిన చర్యలు తీసుకుంటామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ హెచ్చరించారు.
Next Story

