Sun Mar 22 2026 04:25:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బాబుమోహన్ జంప్....!

టీఆర్ఎస్ టిక్కెట్ దక్కని మాజీ మంత్రి బాబుమోహన్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆందోల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆయనకు ఈసారి కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ స్థానాన్ని జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ కు కేటాయించారు. దీంతో పార్టీ వైఖరిపై బాబుమోహన్ అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్, హరీష్ రావు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ, టిక్కెట్ ఇవ్వకుండా తనను అవమానించారనే భావనతో ఉన్న ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.
Next Story

