Fri Jan 30 2026 23:35:52 GMT+0000 (Coordinated Universal Time)
నడిరోడ్డుపైన ఉరి తీయండి... బాబా రాందేవ్ ఫైర్

ఢిల్లీలో ఆశ్రమం నడుపుతూ మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దాతి మహరాజ్ పై యోగా గురు బాబా రాందేవ్ మండిపడ్డారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయం దరించిన వారందరూ సాధువులు కారని, భక్తి ముసుగులో మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వాడిని నడిరోడ్డులోకి లాక్కొచ్చి ప్రజలే ఉరితీయాలని వ్యాఖ్యానించారు. బాబాలు, సాధువుల ముసుగులో నేరాలకు పాల్పడితే కచ్చితంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. ఢిల్లీ శివారులో శ్రీ శనిధామ్ ట్రస్ట్ పేరిట ఆశ్రమం నడుపుతున్న దాతి మహరాజ్ తనపై అత్యాచారం చేశాడని ఓ మాజీ శిష్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. అప్పటి నుంచి దాతి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు
Next Story

