Sat Mar 21 2026 16:08:15 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు అవకాశమిస్తే పాలన చేసి చూపిస్తారు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కరోనా నియంత్రణపై పూర్తిగా చేతులెత్తేసిందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఏపీలో వెంటనే హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కరోనా నియంత్రణపై పూర్తిగా చేతులెత్తేసిందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఏపీలో వెంటనే హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కరోనా నియంత్రణపై పూర్తిగా చేతులెత్తేసిందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఏపీలో వెంటనే హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా ను తన చేతకాని తనం వల్లనే జగన్ విస్తృతం చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. వందలాది మంది జనం ఆక్సిజన్ లేక, ఇంజక్షన్లు లేక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అయ్యన్న పాత్రుడు అన్నారు. వ్యాక్సినేషన్ విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని అయ్యన్న పాత్రుడు చెప్పారు. కరోనా ను నియంత్రించలేకపోతే జగన్ దిగిపోవాలని, చంద్రబాబు పాలన చేసి చూపిస్తారని ఆయన సవాల్ విసిరారు.
Next Story