Thu Mar 19 2026 15:29:35 GMT+0530 (India Standard Time)
అదే జరిగితే బాబును వ్యతిరేకిస్తా

కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ అరాచకాలని అరికట్టి తరిమికొట్టడానికని, అటువంటిది కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే జనాలు గుడ్డలూడదీసి కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో చేతులు కలిపే పరిస్థితే వస్తే ప్రజలు క్షమించరని, తమను తామే క్షమించుకోలేమని వ్యాఖ్యానించారు. ఒకవేళ కాంగ్రెస్ తో కలిసే పరిస్థితే వస్తే మొదట వ్యతిరేకించేది తానేనని స్పష్టం చేశారు.
Next Story

