Wed Mar 18 2026 16:09:27 GMT+0530 (India Standard Time)
లగడపాటి ఇక ఆపు…!!
లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలతో తెలుగుదేశం పార్టీ నేతలు తమ గెలుపుపై నమ్మకంగా ఉంటే మంత్రి అయ్యన్నపాత్రుడు మాత్రం లగడపాటి సర్వేను కొట్టి పారేశారు. ప్రజల నాడి [more]
లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలతో తెలుగుదేశం పార్టీ నేతలు తమ గెలుపుపై నమ్మకంగా ఉంటే మంత్రి అయ్యన్నపాత్రుడు మాత్రం లగడపాటి సర్వేను కొట్టి పారేశారు. ప్రజల నాడి [more]

లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలతో తెలుగుదేశం పార్టీ నేతలు తమ గెలుపుపై నమ్మకంగా ఉంటే మంత్రి అయ్యన్నపాత్రుడు మాత్రం లగడపాటి సర్వేను కొట్టి పారేశారు. ప్రజల నాడి లగడపాటికి ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వేను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు బెట్టింగ్ ల్లో పొగొట్టుకున్నారన్నారు. కొంత మంది తన వద్ద కూడా ఈ విషయం చెప్పారని అన్నారు. ప్రజల నాడి తెలియకుండా లగడపాటి సర్వే చేశారని ఆయన పేర్కొన్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ గెలుస్తుందని అంచనా వేయగా లగడపాటి మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.
Next Story