Wed Dec 17 2025 04:48:38 GMT+0000 (Coordinated Universal Time)
సీఎస్ కు ఎన్నికల కమిషనర్ లేఖపై వైసీపీ ఫైర్
చీఫ్ సెక్రటరీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు. టీడీపీ నేత రాసినట్లుగా ఆయన సీఎస్ కు లేఖ [more]
చీఫ్ సెక్రటరీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు. టీడీపీ నేత రాసినట్లుగా ఆయన సీఎస్ కు లేఖ [more]

చీఫ్ సెక్రటరీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు. టీడీపీ నేత రాసినట్లుగా ఆయన సీఎస్ కు లేఖ రాశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల విషయం ఈయనకెందుకని ఆయన ప్రశ్నించారు. టీడీపీకి వెసులుబాటు కల్పించేందుకే ఎన్నికలను రమేష్ కుమార్ వాయిదా వేశారన్నారు. ఇక ఎన్నికలు ఎప్పుడు జరిపినా వైసీపీదే విజయమన్నారు. చంద్రబాబు తాత్కాలికంగా పైశాచికానందం పొందవచ్చని, అయితే చివరకు గెలిచేది వైసీపీయేనని ఆయన తెలిపారు.
Next Story