Mon Mar 23 2026 16:21:08 GMT+0530 (India Standard Time)
భూమా కుటుంబంతో సంబంధాలు తెగినట్లే

ఇక భూమా కుటుంబంతో తనకున్న అనుబంధం తెగిపోయినట్లేనని ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏవీ సుబ్బారెడ్డి టీడీపీ ముఖ్యనేతలను కలిశారు. తనపై జరిగిన రాళ్లదాడి విషయంలో ఆధారాలతో వారికి చూపించారు. అఖిలప్రియ ఇలా ఎందుకు చేస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను పార్టీ బలోపేతం కోసం పనిచేస్తుంటే, తనను తప్పుగా అర్థం చేసుకుంటుందని ఏవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రితో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి భేటీ కావాల్సి ఉండగా అఖిలప్రియ గైర్హాజరుతో సమావేశం రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు సూచనల మేరకు తాను రాజకీయంగా అఖిలకు మద్దతిస్తాను తప్పించి, వ్యక్తిగతంగా తమ కుటుంబాల మధ్య ఎటువంటి సంబంధాలుండవని ఏవీ స్పష్టం చేశారు.
Next Story

