Mon Mar 23 2026 02:26:03 GMT+0530 (India Standard Time)
వామ్మో...ఆటోలో అన్ని కోట్లా?

నల్లగొండ పట్టణంలో ఓ ట్రాలీ ఆటో అందరినీ షాక్ కు గురిచేసింది. ట్రాలీ ఆటోలో ఉన్న లోడు చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాల్లోకెళితే..జిల్లా కేంద్రంలోని ఎస్ బీ ఐ బ్యాంకుకు రైతుబంధు పథకం కోసం భారీ నగదు వచ్చింది. ఈ బ్యాంకు నుంచే జిల్లాలోని ఇతర బ్యాంకులకు నగదు తరలించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి నల్లగొండ గ్రామీణ వికాస్ బ్యాంక్ కు రూ.48 కోట్లు పంపించాల్సి ఉంది. ఇందుకోసం బ్యాంకు అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పూర్తి భద్రతతో జరగాల్సిన నగదు తరలింపు ప్రక్రియకు పాత సామాన్ల ట్రాలీ ఆటోను ఉపయోగించారు. అది కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా. రోడ్డున వెళ్లే వారు బయట నుంచి చూసిన వారికి కూడా స్పష్టంగా ఆటోలో తీసుకెళుతోంది డబ్బులే అనే విషయం స్పష్టంగా కనపడింది. బ్యాంకు అధికారుల చర్యలను స్థానికులతో పాటు పోలీసులు కూడా తప్పుబట్టారు.
Next Story

