Sun Feb 01 2026 10:48:28 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా స్టైరిన్ నిల్వలు… తరలించేందుకు ఏర్పాట్లు?
విశాఖపట్నంలో భారీగా స్టైరిన్ నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనేక చోట్ల స్టైరిన్ నిల్వలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించిన అధికారులు వీటిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ [more]
విశాఖపట్నంలో భారీగా స్టైరిన్ నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనేక చోట్ల స్టైరిన్ నిల్వలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించిన అధికారులు వీటిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ [more]

విశాఖపట్నంలో భారీగా స్టైరిన్ నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనేక చోట్ల స్టైరిన్ నిల్వలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించిన అధికారులు వీటిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన తర్వాత రసాయన పరిశ్రమల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో స్టైరిన్ నిల్వలు పెద్దయెత్తున ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని సముద్ర మార్గం ద్వారా తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక ఓడలను వినియోగించాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని స్టైరిన్ నిల్వలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story