Mon Mar 23 2026 15:26:27 GMT+0530 (India Standard Time)
జగన్ పై హత్యాయత్నంపై సిట్ ఏర్పాటు

జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటన పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని విశాఖ డీసీపీ మహేంద్ర పాత్రుడు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం లో ఏసిపి నాగేశ్వర రావు తో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉంటారని ఆయన చెప్పారు. విశాఖ ఎయిర్పోర్టులో జగన్ పై 12.34 నిమిషాలకు హత్యాయత్నం జరిగిందని, నిందితుడు జానపల్లి శ్రీనివాస్ వైసీపీ అభిమాని అని చెప్పారు. పాపులారిటీ కోసం హత్యాయత్నం చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు డీజీపీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు.
Next Story

