Mon Mar 23 2026 18:43:18 GMT+0530 (India Standard Time)
ఆరు నెలల్లో రెండు లోన్లు మంజూరు....!!

వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దాడిపై ఈరోజు హైకోర్టులో పిటీషన్ వేస్తామన్నారు. ఈ కేసులో ఏ1 ముద్దాయి చంద్రబాబని, ఏ2 నిందితుడు డీజీపీ అని వైవీ అన్నారు. సంఘటన జరిగినవెంటనే నిందితుడి వద్ద ఉన్న లేఖను ఎందుకు బయటపెట్టలేదన్నారు. రక్తి కట్టించడానికే రాత్రి పూట లేఖను బయటపెట్టారన్నారు. నిందితుడు శ్రీనివాస్ కుటుంబానికి ఆరు నెలల్లో రెండు లోన్లు ఎలా మంజూరయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత ఉండదనే హైదరాబాద్ కు తరలించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు.
- Tags
- airport
- andhrapradesh
- ap politics
- murder attempt
- nara chandrababu naidu
- telugudesam party
- visakhapatnam
- y.s jaganmohanreddy
- y.v.subbareddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఎయిర్ పోర్ట్
- ఏపీ పాలిటిక్స్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- విశాఖపట్నం
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- వైవీ సుబ్బారెడ్డి
- హత్యాయత్నం
Next Story

