Mon Mar 23 2026 16:57:54 GMT+0530 (India Standard Time)
మాకు అంటగడతారెందుకు....?

వైసీపీ అధినేత జగన్ పై దాడిని తమకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ వెలుపల జరిగితేనే అది ప్రభుత్వ బాధ్యత అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జగన్ పై దాడిని తాము ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎయిర్ పోర్ట్ లోపల జరిగిన వెంటనే జగన్ ఇక్కడ చికిత్స చేయించుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోయారని, పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఎలా దర్యాప్తు చేయాలని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ లోపల దాడి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందన్నారు. కేంద్ర సర్కార్ కుట్రలో భాగంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అన్ని కుట్రలను ఎదుర్కొని తాము సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తామని చెప్పారు.
Next Story

