Tue Mar 17 2026 08:58:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ నేతల దాడి

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో అభ్యర్థిగా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో ఆయనన ప్రచారం చేస్తున్నారని కొందరు బీజేపీ నేతలు అడ్డుకున్నారు. మాటామాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది. వంశీపై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆయనకు గాయం కాగా స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి నిమ్స్ కు తరలించారు. బీజేపీ కార్యకర్తలే తమ నేతపై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story

