Sun Mar 15 2026 07:40:06 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ లో మద్యం సేవించి అర్ధరాత్రి హత్య చేసి?
హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. హుడా కాలనీ లో శ్రవణ్ (25) అనే యువకుడిని దారుణ హత్య చేశారు. మద్యం [more]
హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. హుడా కాలనీ లో శ్రవణ్ (25) అనే యువకుడిని దారుణ హత్య చేశారు. మద్యం [more]

హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. హుడా కాలనీ లో శ్రవణ్ (25) అనే యువకుడిని దారుణ హత్య చేశారు. మద్యం మత్తులో ఉన్న స్నేహితులే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంటి ఎదుట శ్రవణ్, నిన్న రాత్రి 2:30 గంటల వరకూ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు, ఆపై స్నేహితుల మధ్య గొడవ జరగడంతో, హాకీ కర్ర మరియు కత్తులతో దాడి చేసి శ్రవణ్ ను దారుణంగా హత మార్చారని కుటుంబ సభ్యులు చెప్పారు. దీనితో సమాచారం అందుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Next Story

