Sun Mar 29 2026 09:01:23 GMT+0530 (India Standard Time)
Nalgonda : ఈ ఎస్ ఐని బదిలీ మాత్రమే చేశారు
ఒక దొంగతనం కేసులో గిరిజనుడిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీని ఉపయోగించిన ఆత్మకూరు ఎస్ఐ లింగయ్య యాదవ్ పై వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు [more]
ఒక దొంగతనం కేసులో గిరిజనుడిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీని ఉపయోగించిన ఆత్మకూరు ఎస్ఐ లింగయ్య యాదవ్ పై వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు [more]

ఒక దొంగతనం కేసులో గిరిజనుడిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీని ఉపయోగించిన ఆత్మకూరు ఎస్ఐ లింగయ్య యాదవ్ పై వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీఆర్ కు బదిలీ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. లింగయ్య గిరిజనుడు వీరశేఖర్ ను ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. అతనిని చిత్ర హింసలు పెట్టారు. తాను నేరం చేయలేదని చెప్పినా వినిపించుకోకుండా టార్చర్ పెట్టారు. దీనిపై పెద్దయెత్తున ఆరోపణలు, విమర్శలు రావడంతో ఎస్ఐ లింగయ్య యాదవ్ ను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story