Thu Mar 19 2026 07:37:46 GMT+0530 (India Standard Time)
ఒక శకం ముగిసింది

దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి మృతితో దేశంలో ఒక శకం ముగిసిందన్నారు. దేశం కోసమే ఆయన ప్రతిక్షణాన్ని అంకితం చేశారన్నారు మోడీ. వాజ్ పేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటల్ లేరన్న వార్త తనను కలచి వేసిందన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయామన్నారు. దేశం ఒక మంచి లీడర్ ను కోల్పోయిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు.
Next Story

