Thu Mar 19 2026 06:00:59 GMT+0530 (India Standard Time)
ఎట్ హోంకి బాబు దూరం..!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తేనీటి విందు ఇచ్చారు. బుధవారం సాయంత్రం రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టీస్ రాధాకృష్ణన్, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, స్పీకర్ మధుసుదనాచారి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నాయిని నరసింహారెడ్డి, కేశవరావు తదితరులు హాజరయ్యారు. అయితే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో విశాఖపట్నం జిల్లాలో ఉండగా, చంద్రబాబు అమరావతిలోనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఎంపీ సుజనా చౌదరి హాజరయ్యారు.
Next Story

