Fri Mar 20 2026 09:45:11 GMT+0530 (India Standard Time)
కోమటిరెడ్డి విషయంలో వారికి కోర్టు నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన కోర్టు దిక్కార పిటీషన్ ను హైకోర్టు శుక్రవారం విచారించింది. గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. దీంతో వారు కోర్టుకు వెళ్లగా అక్కడ వీరి బహిష్కరణ చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయడం లేదని, తమను ఎమ్మెల్యేలుగా పరిగణించడం లేదని ఇద్దరు ఎమ్మెల్యేలు హైకోర్టు కోర్టు దిక్కార పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు అసెంబ్లీ కార్యదర్శికి, న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 13వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

