Fri Mar 27 2026 09:13:12 GMT+0530 (India Standard Time)
పాపం పైలెట్ కు ఆ పదవా?

రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం అశోక్ గెహ్లాట్ పేరును ఖరారు చేసింది. ఆరాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ కు డిప్యూటీ సీఎం పదవి కేటాయించింది. రాజస్థాన్ సీఎం పదవి కోసం గత రెండు రోజులుగా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లు హోరాహోరీగా తలపడుతున్నారు. రాహుల్ గాంధీతో సమావేశమై తాము గత ఐదేళ్ల నుంచి చేసిన కృషిని సచిన్ పైలెట్ వివరించారు. అశోక్ గెహ్లాట్ కూడా తనకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వాలో వివరంగాచెప్పారు. దీంతో చివరకు అశోక్ గెహ్లాట్ పేరును రాహుల్ ఖారారు చేశారు. సచిన్ పైలెట్ పీీసీీసీ చీఫ్ గానూ కొనసాగుతారు. మరికొద్ది సేపట్లో రాహుల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పేర్లను వెల్లడించనున్నారు.
Next Story

