Fri Dec 05 2025 09:22:41 GMT+0000 (Coordinated Universal Time)
ashok babu : పీఆర్సీ వస్తుందన్న నమ్మకం లేదు
ఉద్యోగ సంఘాల నాయకత్వంపై నమ్మకం పోయిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఉద్యోగ సంఘాల చేతకాని తనం చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. పీఆర్సీ ప్రభుత్వం ఇప్పట్లో ఇవ్వదని [more]
ఉద్యోగ సంఘాల నాయకత్వంపై నమ్మకం పోయిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఉద్యోగ సంఘాల చేతకాని తనం చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. పీఆర్సీ ప్రభుత్వం ఇప్పట్లో ఇవ్వదని [more]

ఉద్యోగ సంఘాల నాయకత్వంపై నమ్మకం పోయిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఉద్యోగ సంఘాల చేతకాని తనం చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. పీఆర్సీ ప్రభుత్వం ఇప్పట్లో ఇవ్వదని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల తర్వాత కూడా ఇంకా పీఆర్సీపై చర్చలు ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఊడిగం చేసే నేతల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయే నాయకత్వం వల్ల ఉద్యోగులకు ఎటువంటి న్యాయం జరగదని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.
Next Story