Thu Mar 19 2026 03:06:12 GMT+0530 (India Standard Time)
అసదుద్దిన్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... తనను నిర్మల్ సభకు రావద్దని కాంగ్రెస్ నేతలు ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని, సభకు రాకుంటే రూ.25 లక్షలు ఇస్తామన్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫోన్ రికార్డులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, ప్రజలు కూడా మోసపోవద్దని పేర్కొన్నారు. ముస్లింలంతా టీఆర్ఎస్ కే ఓటేయాలని పిలుపునిచ్చారు.
Next Story

