Thu Mar 26 2026 02:46:27 GMT+0530 (India Standard Time)
బాబుపై ఒవైసీ నిప్పులు

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పుులు చెరిగారు. కూకట్ పల్లిని అభ్యర్థిని అమరావతిలో కూర్చుని చంద్రబాబు నిర్ణయిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కూకట్ పల్లిలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్ కారుకు ఎంఐఎం ఇంజిన్ లాంటిదన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్ అనుకూలం కాదన్నారు. బీజేపీకూడా వ్యతిరేకమన్నారు. తాము టీఆర్ఎస్ కే మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఏపీ రాజకీయాలు చూసుకోవాలని హితవు పలికారు. ఇక్కడి కొచ్చి బాబు చేసేదేమీ లేదని చెప్పుకొచ్చారు.
Next Story

