ఉరెళ్తున్నారా... పార్శిల్ తీసుకెళ్లండి.. డబ్బులు సంపాదించండి!!
తెలంగాణ ఆంధ్రా బోర్డర్ లో ఒక మారుముల గ్రామం నుండి వచ్చిన 22 ఏళ్ళ కుర్రాడు తారక్ స్థాపించిన డెలీ మేట్ యాప్ గురించి అందరు తెల్సుకోవాల్సిందే!!

తెలంగాణ ఆంధ్రా బోర్డర్ లో ఒక మారుముల గ్రామం నుండి వచ్చిన 22 ఏళ్ళ కుర్రాడు తారక్ స్థాపించిన డెలీ మేట్ యాప్ గురించి అందరు తెల్సుకోవాల్సిందే!!
తిరుపతి నుంచి హైదరాబాద్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాడు మహేష్. స్నేహితుడు చెప్పాడు అని డెలీ మేట్(DELEMATE) తెరిచి అందులో తన ప్రయాణానికి సంబంధించిన వివరాలు నమోదు చేశాడు. అది చూసిన రమేష్ అనే వ్యక్తి, మహేష్ చేతికి ఓ కవర్ ఇచ్చి హైదరాబాద్ లో ఇవమ్మన్నాడు. అలా దానిని పట్టుకెళ్లి ఇవ్వడం ద్వారా మహేష్ తన టికెట్ కు అయిన ఖర్చులో కొంత డబ్బు సంపాదించగలిగాడు. రవి కూడా తన పార్శిల్ త్వరగా పంపగలిగాడు. అలా ఈ యాప్ ఇద్దరికీ ఉపయోగకరంగా పని చేసింది.
ఒకప్పుడు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఏదైనా అత్యవసరంగా పంపాలంటే కచ్చితంగా ఓ వ్యక్తి వెళ్లి రావాల్సిందే. ఆ తరవాత ఎన్నో రకాల పార్సిల్ సర్వీసులు వచ్చాయి. ప్రస్తుత అవసరాలను బట్టి ఇప్పుడు వాటిలోనే వేగంగా చేర్చే కొరియర్ వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. ఇంకా నగరాల్లో, పట్టణాల్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు పంపడానికి కొత్తరకం ట్రావెల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వస్తువుల్ని పంపడానికి మాత్రమే సహాయపడుతాయి. కానీ మన తెలుగు వాళ్ళు డెవలప్ చేసిన డెలీ మేట్(DELEMATE) సర్వీస్ ఇందుకు బిన్నం. మాములుగా రోజు ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాంతానికి ప్రయాణిస్తూనే ఉంటారు. అది విజయవాడ నుంచి హైదరాబాద్ అవ్వచ్చు, అనంతపురం నుంచి ఢిల్లీ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఈ యాప్ ద్వారా డబ్బులు సంపాందించుకోవచ్చు. ఎందుకంటే ప్రయాణికులు ద్వారానే ఈ కొరియర్ సర్వీస్ నడుస్తుంది. ఒకవైపు వస్తువులు తొందరగా పంపాలనుకునే వాళ్లకు ఉపయోగకరంగా, మరోవైపు అందులో నమోదు చేసుకున్న ప్రయాణికులకు ఇద్దరికి ఉపయోగకరంగ ఉంటుంది యాప్.
డెలీ మేట్(DELEMATE) యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక పేరు, ఊరు పూర్తి చిరునామాలతో నమోదు చేసుకోవాలి. మనం మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తుంటే ఆ సమాచారాన్ని యాప్ లో ఉంచవచ్చు. అక్కడనుంచి ఏదైనా పంపాలన్న వాళ్ళు అది చూసి మనకు ఫోన్ చేసారు. వాళ్ళ వస్తువులు భద్రంగా అందజేస్తే డబ్బులు ఇస్తారు. విలువైన వస్తువుల్ని ఎవరికి పడితే వాళ్లకు ఎలా అప్పగించాలని అనుకుంటున్నారా? అయితే మీ వస్తువులను తీసుకుని ప్రయాణించే వ్యక్తి పూర్తి వివరాలు, ఫోటో తో పాటూ అన్ని వివరాలు ఈ యాప్లో ఉంటాయి. తీసుకెళ్లే వస్తువులు ముందుగా ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు కాబట్టి.. డెలివరీ పాయింట్ కు చేరుకున్నప్పుడు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. యాప్ కు అనుసంధానించిన లొకేషన్ ద్వారా డెలివరీ చేస్తున్న వ్యక్తి ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. వస్తువుల్ని అందుకున్నాక నేరుగా పేమెంట్ చేయవచ్చని డెలీi మేట్ (DELEMATE) CEO తారక్ తెలుగు పోస్ట్ తో అన్నారు.
ఈ యాప్ లాంచ్ అయినా మొదటి వారంలోనే వెయ్యి కి పైగా యూజర్స్ తమ తదుపరి ట్రిప్స్ కుడా యాడ్ చేసుకున్నారు.
మరి ఇంకెదుకు ఆలస్యం క్రింద కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి DELEMATE యాప్ డౌన్లోడ్ చేస్కుని పార్శిల్ తీసుకెళ్లండి.. డబ్బులు సంపాదించండి!!