Thu Mar 19 2026 00:10:26 GMT+0530 (India Standard Time)
అశోక్ బాబూ....వెళ్లిపో....!

ఏపీఎన్జీవో సంఘం నేత అశోక్ బాబుకు ఉద్యోగుల నుంచే అవమానం ఎదురైంది. శనివారం విజయవాడలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలు జింఖానా గ్రౌండ్ లో ధర్నా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అశోక్ బాబు హాజరవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆయనను స్టేజ్ పైకి ఆహ్వానించగానే ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమాన్ని చీల్చే అశోక్ బాబు వంటి వారిని వేదికపైకి పిలవొద్దని నినదాలు చేశారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉదృక్తత నెలకొంది.
Next Story

