Mon Dec 08 2025 17:28:31 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కు ఆ ధైర్యం ఉందా..?

కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనంద్ బాబు సవాల్ విసిరారు. కేసీఆర్ కు ధైర్యం ఉంటే మాటలు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి నేరుగా రావాలని సవాల్ చేశారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ ను, జనసేన పార్టీలతో తెలంగాణలో లాగా తెరచాటు రాజకీయాలు చేయకుండా నేరుగా ఇక్కడ రాజకీయాలు చేయగలరా అని ప్రశ్నించారు. జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని, అందుకే రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులతో చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ గెలిస్తే వైసీపీ, జనసేన సంబరాలు చేసుకోవడమే సిగ్గుచేటన్నారు. బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీఆర్ఎస్ కారుకు బీజేపీ, వైసీపీ, జనసేన, ఎంఐఎం పార్టీలు నాలుగు చక్రాల్లాగా పనిచేస్తున్నాయని విమర్శించారు.
Next Story

