Thu Mar 19 2026 08:48:48 GMT+0530 (India Standard Time)
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కి బదులు నగదు!
రెండేళ్ల క్రితమే వైసీపీ ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది కానీ.. ఆచరణ సాధ్యం కాలేదు. తాజాగా త్వరలోనే రేషన్ ..

అమరావతి : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత టిడిపి ప్రభుత్వం అమలు చేయాలని భావించి, పరిశీలించి, ఆ తర్వాత విరమించుకున్న రేషన్ నగదు బదిలీ విధానాన్ని జగన్ సర్కార్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. రెండేళ్ల క్రితమే వైసీపీ ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది కానీ.. ఆచరణ సాధ్యం కాలేదు. తాజాగా త్వరలోనే రేషన్ నగదు బదిలీ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మే నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుండగా.. పైలట్ ప్రాజెక్ట్ కింద అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ముందుగా అమలు చేయనున్నారు. ఈనెల 18 నుండి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుని.. బియ్యం వద్దనుకునే లబ్ధిదారులకు కిలోకు రూ.12 నుంచి రూ.15 చెల్లించనున్నట్లు తెలుస్తుంది.
Next Story

