Mon Dec 08 2025 17:22:46 GMT+0000 (Coordinated Universal Time)
ఆక్సిజన్ పై ఏపీ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధానంగా ఆక్సిజన్ నిల్వలు సరిపోయేలా ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం రోజుకు 80 నుంచి వంద టన్నుల [more]
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధానంగా ఆక్సిజన్ నిల్వలు సరిపోయేలా ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం రోజుకు 80 నుంచి వంద టన్నుల [more]

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధానంగా ఆక్సిజన్ నిల్వలు సరిపోయేలా ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం రోజుకు 80 నుంచి వంద టన్నుల ఆక్సిజన్ అవసరమవతుందని అధికారులు అంచనా వేశారు. పీక్ స్టేజీ లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని లెక్కలు వేశారు. దీంతో ప్రభుత్వం ఆక్సిజన్ కొరత లేకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఆక్సిజన్ నిల్వలను తెప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. భువనేశ్వర్, బళ్లారి, చెన్నై, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.
Next Story