Sun Mar 22 2026 06:15:06 GMT+0530 (India Standard Time)
ఏపీ ఎక్సెప్రెస్ లో అగ్నిప్రమాదం

ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయలుదేరిన ఏపీ ఎక్సప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన రైలు గ్వాలియర్ వద్దకు చేరుకోగానే షార్ట్ సర్క్యూట్ ద్వారా ఏసీ కోచ్ లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రైలు సిబ్బంది వెంటనే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైలులోని మొత్తం నాలుగు ఏసీ కోచ్ లు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక, రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు నడిచే ఈ రైలులో ఎక్కువగా తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులే ఎక్కువగా ఉన్నారు.
Next Story

