Thu Mar 19 2026 01:12:29 GMT+0530 (India Standard Time)
ఏపీ డీజీపీ నిర్ణయం భేష్...

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆర్.పి.ఠాకూర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ను ఆపి, వాహనదారులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన గన్నవరం నుంచి విజయవాడకు వెళుతుండగా, ప్రోటోకాల్ ప్రకారం ట్రాఫిక్ ని నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన డీజీపీ ఇక నుంచి తన కోసం ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేవారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా మారాక, తరచూ వీఐపీల వాహనాల కోసం ట్రాఫిక్ ని నిలిపివేయడం సర్వసాధారణమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి డీజీపీ నిర్ణయం కొంత మేలే. అయితే, డీజీపీని ఆదర్శంగా ఇతర వీఐపీలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Next Story

