Tue Jan 20 2026 15:07:05 GMT+0000 (Coordinated Universal Time)
డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ..?
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ అయినట్లు తెలిసింది. ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్ర నాధ్ రెడ్డిని నియమించనున్నారు

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ అయినట్లు తెలిసింది. ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్ర నాధ్ రెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. డీజీపీగా గౌతం సవాంగ్ జగన్ కు అనుకూలంగా ఉన్నారు. అయితే ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయడం పై పెద్దయెత్తున ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలుున్నాయి.
రాజేంద్ర నాధ్ రెడ్డిని...
డీజీపీ గా గౌతం సవాంగ్ గత రెండు సంవత్సరాలుగా మంచి అధికారిగా పనిచేశారు. అనేక విషయాల్లో ఏపీ పోలీసులు అవార్డులు కూడా అందుకున్నారు. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్ర నాధ్ రెడ్డి నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఆయన ప్రస్తుతం ఇంటలిజెన్స్ డీజీగా ఉన్నారు. గౌతం సవాంగ్ బదిలీకి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. నిన్ననే సీఎంవో కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు.
- Tags
- gautam sawang
- dgp
Next Story

