Wed Mar 25 2026 08:19:53 GMT+0530 (India Standard Time)
మూడు గంటలుగా కేసీఆర్, జగన్…?
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు మూడు గంటలుగా ప్రగతి భవన్ లో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్ కు చేరుకున్నారు జగన్. జగన్ [more]
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు మూడు గంటలుగా ప్రగతి భవన్ లో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్ కు చేరుకున్నారు జగన్. జగన్ [more]

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు మూడు గంటలుగా ప్రగతి భవన్ లో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్ కు చేరుకున్నారు జగన్. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. కేసీఆర్ తో లంచ్ చేసిన అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంతంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పోతిరెడ్డి పాడు అంశం కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ బేటి సుదీర్ఘంగా సాగుతుండటం విశేషం.
Next Story