Wed Mar 18 2026 12:21:06 GMT+0530 (India Standard Time)
నన్నెందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదు

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో తన అనుచరుడిగా ఉన్న వ్యక్తి తననే తిడుతుంటే బాధనిపిస్తోందని ఆయన అన్నారు. రాత్రి పగలు కష్టపడి హైదరాబాద్ ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసినందుకే తనను తిడుతున్నారా అని ప్రశ్నించారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని తాను అంటుంటే కేసీఆర్ మాత్రం ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ కి జగన్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.
Next Story

