Thu Mar 19 2026 05:52:17 GMT+0530 (India Standard Time)
బాబు ఫేస్ చూడాలని ఉంది
చంద్రబాబు ను అసెంబ్లీకి తీసుకురావాలని, ఆయన మొహం చూడాలని ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు

చంద్రబాబు ను అసెంబ్లీకి తీసుకురావాలని, ఆయన మొహం చూడాలని ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బీఏసీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కుప్పం ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్రబాబు ఫేస్ ఒకసారి చూడాలని ఉందని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఆయన సభకు ఖచ్చితంగా వస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ నెల 26వ తేదీ వరకూ...
ఈ నెల 26వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. కుప్పంలో ఎలా గెలిచారో అందరికీ తెలుసునని, బీఏసీ సమావేశాల్లో ఎన్నికల అంశం ఎందుకని అచ్చెన్నాయుడు నిలదీశారు. పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు కోరారు. అన్నింటిపైనా చర్చ జరిగేందుకు సహకరించాలని జగన్ కోరారు
Next Story

