Sun Mar 16 2025 07:17:45 GMT+0000 (Coordinated Universal Time)
ఈసీ పనితీరుపై అనుమానాలు వద్దు
ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేస్తుందని, తమ పనితీరుపై అనుమానాలు అక్కర్లేదని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికార జీకే ద్వివేది పేర్కొన్నారు. మంగళవారం ఐటీ గ్రిడ్ వ్యవహారంపై వైఎస్సార్ [more]
ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేస్తుందని, తమ పనితీరుపై అనుమానాలు అక్కర్లేదని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికార జీకే ద్వివేది పేర్కొన్నారు. మంగళవారం ఐటీ గ్రిడ్ వ్యవహారంపై వైఎస్సార్ [more]

ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేస్తుందని, తమ పనితీరుపై అనుమానాలు అక్కర్లేదని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికార జీకే ద్వివేది పేర్కొన్నారు. మంగళవారం ఐటీ గ్రిడ్ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆయనకు ఫిర్యాదు చేశారు. రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని, తమ పని తాము చేస్తామని స్పష్టం చేశారు. వారం క్రితం వరకు ఓట్లు తొలగించాలని ప్రతీరోజూ వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేయని, ఇప్పుడు కేవలం 300కు మించి రావడం లేదన్నారు. అన్ని వివరాలు పరిశీలించాకే ఓట్లు తొలగిస్తామని పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థకు ఓటర్ల డేటా ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు చెప్పాలని ఆయన అన్నారు.
Next Story