Tue Jan 20 2026 19:51:49 GMT+0000 (Coordinated Universal Time)
Ap cabinet : నేడు మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ [more]
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ [more]

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో విక్రయించే ఆర్డినెన్స్ కు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ తేనుంది. అలాగే వచ్చేే నెలలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కూడా మంత్రివర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు, టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం చట్ట సవరణ, భూ కేటాయింపుల వంటి నిర్ణయాలు ఈ మంత్రి వర్గ సమావేశంలో తీసుకోనున్నారు.
Next Story