Thu Mar 19 2026 18:07:20 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ కేబినెట్.. జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
ఏపీ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గం [more]
ఏపీ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గం [more]

ఏపీ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీలో పదమూడు జిల్లాల స్థానంలో 23 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. దీనిపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిపై ఈరోజు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా మంత్రి వర్గం చర్చించనుంది. అలాగే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్ కు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలపనుంది.
Next Story