Tue Mar 24 2026 21:18:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎల్లుండి ఏపీ కేబినెట్ విస్తరణ

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఎల్లుండి కేబినెట్ విస్తరణ జరగనుంది. కేబినెట్ లో ప్రస్తుతం ఉన్న రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారందరినీ కొనసాగిస్తూనే కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కేబినెట్ లో ముస్లింలు లేనందున ఎమ్మెల్సీగా ఉన్న ఫరూక్ కి అవకాశం దక్కనుంది. ఇక ఇటీవల మావోయిస్టుల చేతిలో హతమైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
Next Story

